పటాన్చెరు, డిసెంబర్ 12: సంగారెడ్డి జిల్లా ముత్తం గికి రెండు నెలలుగా తాగునీరు రావడం లేదని ‘నమస్తే తెలంగాణ’ గురువారం ప్రచురితమైన ‘మళ్లీ నీటి సమస్య’ కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించారు.కథనాన్ని చూసిన మిషన్ భగీరథ ఈఈ విజయలక్ష్మి తక్షణం స్పందించి పటాన్చెరు మిషన్ భగీరథ గ్రిడ్ బృందానికి ఆదేశాలు ఇచ్చారు. జాతీయ రహదారి విస్తరణ కోసం చేపట్టిన తవ్వకాల్లో రెండు నెలల క్రితం ముత్తంగి గ్రామానికి వచ్చే మిషన్ భగీరథ గ్రిడ్ ప్రధాన లైన్ ధ్వంసమైంది.ఆ తర్వాత మరమ్మతులు చేయలేదు. ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకపోవడంతో దా దాపు అరవై రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
నీళ్లు లేక అద్దెకున్నవారు ఇప్పటికే ఇం డ్లను ఖాళీ చేస్తున్నారు. ఈ కథనంతో విషయ తీవ్రతను గుర్తించిన జిల్లా అధికారులు రెండు రోజుల్లో ముత్తంగి వాసులకు తాగునీరు అందాలని కాంట్రాక్టర్, ఇంజినీర్లకు ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్ గురువారం నుంచి పాడైన లైన్‌కు ప్రత్యామ్నాయం గా ప్రత్యేక పైప్‌లైన్‌ను ముత్తంగి సంప్వరకు వేయిం చే పనులు చేపట్టాడు. అధికారుల పర్యవేక్షణలో పైప్‌లైన్ పనులు యుద్ధప్రాతిపాదికన చేపడుతున్నారు. శుక్రవారం వరకు తాగునీరు అందజేస్తామ ని మిషన్ భగీరథ ఈఈ విజయలక్షి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, సమస్య పరిష్కరిస్తామని చెప్పా రు.
‘నమస్తే తెలంగాణ’పై ముత్తంగి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యను వెలుగలోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముత్తంగి పంచాయతీ నుంచి తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేసినప్పటి నుంచి సమస్యలు పెరిగాయని వారు వాపోయారు. గ్రామ కార్యదర్శి నుంచి తెల్లాపూర్ మున్సిపల్ ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించిన అధికారి సమస్యను పరిష్కరించడంలేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్ చేసిన తప్పులకు మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారని, ముత్తంగికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తాగునీరు ఇవ్వాలని కోరారు.