సంగారెడ్డి కలెక్టరేట్, మే 24: గ్రామ పాలన అధికారుల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు. గ్రామ పాలన అధికారుల నియామకం కోసం స్క్రీనింగ్, అర్హత పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈనెల 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు విధిగా హాల్‌టికెట్‌తో హాజరు కావాలని, అభ్యర్థి ఫొటోను నిర్దేశించిన ప్రదేశంలో అతికించాలని, లేనిపక్షంలో పరీక్షా కేంద్రంలో అనుమతించమని తెలిపారు.
పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతిస్తారని, ఉదయం 10 గంటల తరువాత అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించరని వెల్లడించారు. అభ్యర్థులు మొబైల్, సెల్ఫోన్లు, టాబ్లెట్లు, పెన్ డ్రైవులు, బ్ల్యూ టూత్ పరికరాలు, పర్సులు, చార్టులు, మణికట్టు గడియారాలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిలేదని పేర్కొన్నారు. ఇంక్, జెల్ పెన్నులను ఉపయోగించవద్దని, పరీక్ష సమయంలో, ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్‌టికెట్‌పై సంతకం చేయాలనే పలు సూచనలు కలెక్టర్ వివరించారు. హాల్‌టికెట్‌పై ఉన్న నిబంధనలను పూర్తిగా పాటించాలన్నారు.
వీసీలో సీసీఎల్ఏ ఆదేశాలు..
మెదక్ మున్సిపాలిటీ, మే 24 : నేడు జరిగే గ్రామపాలన అధికారి పరీక్షలను పకడ్బందగా నిర్వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి గ్రామపాలన అధికారి పరీక్షల నిర్వహణపై సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీలో డీఆర్డీవో భుజంగరావు, మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మన్బాబు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ తదితరు అధికారులు పాల్గొన్నారు.