సిద్దిపేట, ఆగస్టు12: పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని విజయ డెయిరీ జిల్లా చైర్మన్ లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని డిమాం డ్ చేస్తూ సోమవారం పాడి రైతులు సిద్దిపే ట పట్టణంలో విజయడెయిరీ సెంటర్ నుం చి మెస్తాబాద్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రైతులతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా లో ఆరు వేల మంది పాడి రైతులు రోజూ విజయ డెయిరీకి 32 వేల లీటర్ల పాలు పో స్తున్నారని, రూ.12.80 లక్షలు చెల్లించా ల్సి ఉంటుందన్నారు.15 రోజులకు ఒకసారి పా ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా రెండు నెలల 15 రోజుల పాలబిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బిల్లులు రాక పాడిపోషణ ఇబ్బందిగా మారిందన్నారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో వన్‌టౌన్ పోలీసులు రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో పాడి రైతులు బుచ్చిరెడ్డి, రామచంద్రం, ప్రశాంత్‌శర్మ పాల్గొన్నారు.