పటాన్చెరు, అక్టోబర్ 13 : జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆపార్టీ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్టినేటర్ ఆదర్శ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ నాయకులకు వార్డుల బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ నాయకులకు సుల్తానగర్ వార్డు ఎన్నికల ప్రచార బాధ్యత అప్పగించారు. ఈ సందర్భంగా ఆదర్శ్‌రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భారీ మోజార్టీతో గెలుపొందడం ఖాయన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం రాష్ర్టాన్ని అవినీతిమయంగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఉప ఎన్నిక ప్రచార ంలో ప్రజలకు తెలిపి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామన్నారు. సమావేశంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, జిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, ఐలాపూర్ మాణిక్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.