Collector Rahulraj | మెదక్ రూరల్, డిసెంబర్ 07 : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. మెదక్ మంభోజిపల్లి టోల్ ప్లాజా వద్ద ఎఫ్ఎస్టీ బృందాలు చేపడుతున్న తనిఖీలను గమనించి పలు సూచనలు చేశారు. ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున గట్టి నిఘా కొనసాగిస్తూ, పకడ్బందీగా సోదాలు జరపాలని అన్నారు.
ఇప్పటివరకు సోదాలలో పట్టుబడిన లిక్కర్ నిల్వల గురించి వివరాలను అడిగి తెలుసుకుని రిజిస్టర్లు పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు, ఎంసీసీ అమలు, వాహనాల పర్యవేక్షణ, అనుమానాస్పద రవాణా నివారణపై అధికారులు సక్రమంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారో లేదో పరిశీలించారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు 24/7 ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, వాహన పరిశీలన మొత్తం వీడియోగ్రఫీ తప్పనిసరిగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అన్ని రిజిస్టర్లను మెయింటైన్ చేస్తూ అత్యంత పారదర్శకంగా సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు