ఇంటి వ్యర్థాలు పునర్వినియోగించొచ్చు
ఇంటి వ్యర్థాలను తొంబై శాతం పునర్వినియోగించవచ్చని బయో-ఎంజైమ్స్ నిపుణురాలు, పర్యావరణవేత్త రేవతి మాచర్ల సూచించారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో క్యాంటిన్ నిర్వాహకులు, పారిశుధ్య సిబ్బందితో ఆమె ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహ వ్యర్థాలను తిరిగి వాడడంతో పర్యావరణా న్ని కాపాడుకోవచ్చన్నారు. నిత్యం వంటగదిలో ఎన్నో కూరగాయల, ఇతర వ్యర్థాలను తీసి పారేస్తామన్నారు
- బయో-ఎంజైమ్స్ నిపుణురాలు రేవతి మాచర్ల
పటాన్చెరు, డిసెంబర్ 27: ఇంటి వ్యర్థాలను తొంబై శాతం పునర్వినియోగించవచ్చని బయో-ఎంజైమ్స్ నిపుణురాలు, పర్యావరణవేత్త రేవతి మాచర్ల సూచించారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో క్యాంటిన్ నిర్వాహకులు, పారిశుధ్య సిబ్బందితో ఆమె ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహ వ్యర్థాలను తిరిగి వాడడంతో పర్యావరణా న్ని కాపాడుకోవచ్చన్నారు. నిత్యం వంటగదిలో ఎన్నో కూరగాయల, ఇతర వ్యర్థాలను తీసి పారేస్తామన్నారు.
వాటిని వృథా చేయకుండా 600 గ్రాముల తొక్కలకు 200 గ్రాముల బెల్లం, రెండు లీటర్ల నీటిలో కలిపి ఒక ప్లాస్టిక్ బాటిల్లో భద్రపర్చి, దానిలో కొంత బయో ఎంజైమ్ చేర్చితే నెల రోజుల్లోనే ఉపయోగపడే ఎరువుగా తయారవుతుందన్నారు. దాన్ని మొక్కలకు వేస్తే బలం, ఆరోగ్యానికి వాటి ఫలాలు ఉపయోగకరం అన్నారు. వంద గ్రాముల లెమన్ గ్రాస్, వంద గ్రాముల బెల్లం, లీటర్ నీటిలో కొద్దిగా ఎంజైమ్ కలిపితే ఇల్లు శుభ్రం చేసుకునే లిక్విడ్ తయారవుతుందన్నారు.
వేపాకులో బెల్లం, నీరు, కొంత ఎంజైమ్ వేస్తే నీమ్ ఎంజైమ్ వస్తుందన్నారు. గులాబీ పూ లు, తులసీ ఆకులతో కూడా ఎంజైమ్‌లు తయా రు చేసి ఫేస్ ప్యాక్లుగా వాడుకోవచ్చన్నారు. మిగిలిపోయిన అన్నం, బియ్యం/ శనగ పిండిలో రోజ్ ఎంజైమ్ కలుపుకొని ముఖానికి రాసుకుంటే బాగా నునుపుదేలి మెరుస్తారన్నారు. అంతటా చెత్త కుప్పలను పేర్చుకుని మిథేన్ గ్యాస్ ఉత్పత్తి కాకుండా పర్యావరణాన్ని కాపాడే అవకాశముందన్నారు. ఏటా జనవరి 4న బయో ఎం జైమ్ డేగా నిర్వహిస్తారని, ఆ రోజు తాను కూరగాయలతో రూపొందించిన 40లీటర్ల ఎంజైమ్‌ను గీతం పక్కన ఉన్న చెరువులో కలుపుతానని, అది నీటి పీహెచ్ స్థాయి పెరగడానికి ఉపయోగపడుతుందన్నారు. చేపలు కూడా వృద్ధి చెందుతాయన్నారు. థాయిలాండ్‌లోని బయో ఎంజైమ్స్ శిక్షకురాలి సహకారంతో రూపొందించిన పలు బ యో ఎంజైమ్స్‌ను ఆమె సిబ్బందికి చూపించారు. సిబ్బంది ప్రశ్నలకు రేవతి సమాధానాలు ఇచ్చారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

