అక్కన్నపేట, ఫిబ్రవరి 24: హుస్నాబాద్‌లో రవాణాశాఖ, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఆయన నివాసంలో కేశవాపూర్ వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు రమేశాచార్యులు మాట్లాడుతూ మార్చి 8న గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేడం లింగమూర్తి, బంక చందు, చిత్తారి రవీందర్, డాక్టర్ అక్కు శ్రీనివాస్, పెద్ది రవీందర్ తదితరులు పాల్గొన్నారు.