మెదక్ రూరల్, జనవరి23 : మెదక్ జిల్లాలోని పేరూరు గరుడ గంగా సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చదువుల తల్లిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. అక్షరాభ్యాసం కోసం తీసుకొచ్చిన చిన్నారులతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొన్నది.
అక్షరాభ్యాసాలు నిర్వహించారు. విద్యా సరస్వతి అమ్మవారికి వేకువజామునే వేదపండితులు విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి దోర్బల రాజమౌళి శర్మ, మహేష్ శర్మ తదితరులున్నారు.