గజ్వేల్, ఏప్రిల్ 28: రాష్ట్రమంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు వారి శాఖలనే సరిగ్గా నిర్వర్తించలేక పోతున్నారని, వారికి పాలనపై పట్టులేదని, వాళ్లు కేసీఆర్‌పై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను విమర్శించే నైతికత ,అర్హత మంత్రులకు లేదన్నారు. కేసీఆర్ కాలి గోటికి వారు సరిపోరని, మిమ్మల్ని ప్రజలే తిరస్కరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రజలకు తాగునీళ్లు, కరెంట్, కల్యాణలక్ష్మి చెక్కులను అందించడంలో విఫలమమైందన్నారు.
రాష్ట్రంలో ఆరు నెలలుగా గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు వేతనాలు రావడం లేదన్నారు. చిత్తశద్ధి ఉంటే ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలను అమలు చేసి చూపాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీల అమలు, అభివృద్ధిపై దృష్టిసారించాలని హితవు పలికారు. మంత్రులు రాజకీయంగా అవగాహన లేక మాట్లాడుతున్నారని, దేశంలోని ప్రతి రాజకీయ పార్టీకి పండింగ్ ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. మంత్రులు వ్యాపారం మాని ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 10లక్షల పైచిలుకు మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో సభ విజయవంతమైందన్నారుజ ఈ సభతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు.
గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన 826 కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేపట్టాలని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తే, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ సమయం ఇస్తే పంపిణీ చేస్తామని చెబుతున్నారని, ఇన్చార్జి మంత్రి గజ్వేల్ నియోజకవర్గ ఆడబిడ్డల కోసం ఒకరోజు సమయం ఇచ్చి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి కోరారు.
బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గానికి ముంజూరైన రూ.184 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఆర్అండ్ఆర్ బాధితుల పక్షా న నిరాహార దీక్ష చేసిన రేవంత్‌రెడ్డి వారికి ప్రభుత్వం నుంచి ప్యాకేజీ విడుదల చేయా లన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయ కులు ఎన్సీ రాజమౌళి, మధు, నాయకులు నవాజ్‌మీరా, గో పాల్‌రెడ్డి, శ్రీనివాస్, కనకయ్య, మల్లేశం, నాయకులు విరాజత్ అలీ, రాజిరెడ్డి, ఆకుల దేవేందర్, భూపాల్‌రెడ్డి, స్వామిచారి, అహ్మద్ పాల్గొన్నారు.