మర్కూక్, ఏప్రిల్ 21: హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకొని హరితసేన కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మె ల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ చాలెంజ్‌లో భాగం గా హరితసేన ఆధ్వర్యంలో సోమవారం అంగడికిష్టాపూర్‌లో మాజీ సర్పంచ్ దుద్దెడ రాములుగౌడ్, హరితసేన జిల్లా ఇన్చార్జి చెప్యాల రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో మొక్క లు నాటారు.
ఈ సందర్భంగా యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందే ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని కేసీఆర్ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటి హరిత తెలంగాణగా తీర్చిదిద్దారన్నారు. కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ చాలెంజ్, హరితసేన పేరుతో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ 20 కోట్లకు పైగా మొక్కలు నాటారని తెలిపారు.