గజ్వేల్, నవంబర్ 28: కేసీఆర్ పోరాట స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గరువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలోనే నవంబర్ 29కి ప్రత్యేకత ఉందని, నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం చేపట్టిన పోరాటంతోనే రాష్ట్రం వచ్చిందన్నారు. కేసీఆర్ చేపట్టిన సుదీర్ఘ పోరాటంతోనే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు మద్దతిచ్చాయన్నారు. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన చిన్న రాష్ర్టాల అంశంతో కేసీఆర్ 2001 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు.
సిద్దిపేట గడ్డమీద కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను అప్పటి ప్రభుత్వం భగ్నం చేసిందన్నారు. అయినా కేసీఆర్ వెనుకడుగు వేయకుండా పోరాటం చేశారన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందంటే కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఫలితమే అన్నారు. కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా ఎంతో మంది విద్యార్థులు, ఉద్యమకారులు, ఉద్యోగులు అండగా నిలబడ్డరన్నారు. నేడు సిద్దిపేట జిల్లా కేంద్రంలో చేపట్టే దీక్షదివస్కు ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.
ఉదయం 9.30 గంటలకు రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, అమరులైన వారిని స్మరించుకోవాలని పిసుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవీ రవీందర్, యూత్ విభాగం రాష్ట్ర నాయకుడు జుబెర్ పాషా, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, నవాజ్‌మీరా, నూనె కుమార్, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నాయకులు కృష్ణారెడ్డి, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, అర్జున్ గౌడ్, మల్లేశం, రామచంద్రం, రామకృష్ణ రెడ్డి, రమేశ్ గౌడ్, స్వామిచారి, నరేశ్, శివకుమార్, అహ్మద్, నర్సింహులు పాల్గొన్నారు.