గజ్వేల్, డిసెంబర్ 4: ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే మాజీ మంత్రి హరీశ్‌రావుపై కక్షతో రేవంత్‌రెడ్డి కేసులు పెట్టిస్తున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. హరీశ్‌రావుపై కోపంతో చక్రధర్‌గౌడ్‌తో ప్రభుత్వం కేసులు పెట్టిస్తున్నదని, అలాంటి కేసులకు భయపడేది లేదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని ప్రజల గొంతుకగా నిలబడ్డారని, హరీశ్‌రావుకు ప్రజల మద్దతు ఉంటుందన్నారు. హరీశ్‌రావుపై జూన్‌లో ఫిర్యాదు చేస్తే నవంబర్‌లో కేసు విత్‌డ్రా చేసుకున్నారని, తిరిగి కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసు పెట్టారన్నారు. ప్రతిపక్ష హోదాలో హరీశ్‌రావు ప్రజల గొంతుకై మాట్లాడుతున్నారన్నారు. రూ.49వేల కోట్ల పంటరుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 22లక్షమంది రైతులకు రూ.20వేల కోట్ల మాఫీ చేసి మరో రూ.29వేల కోట్ల అప్పును అలాగే ఉంచి చేతులు దులుపుకుంటున్నారన్నారు. సమావేశంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయోద్దీన్, మాజీ జడ్పీటీసీ మల్లేశం, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బెండే మధు, నవాజ్‌మీరా, కౌన్సిలర్ చందు, కనకయ్య, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, శ్రీనివాస్, స్వామిచారి, ఉమార్, శ్రీనివాస్‌రెడ్డి, అహ్మద్ పాల్గొన్నారు.
జహీరాబాద్/కోహీర్, డిసెంబర్ 4: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్, కోహీ ర్ మండలంలోని కొత్తూర్(డి) శివారులో కోహీర్, జహీరాబా ద్, మొగుడంపల్లి మండలాల మిషన్ భగీరథ కార్మికులు వేతనాల కోసం ఆందోళన చేస్తున్నా రు. దీంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్ అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. 14 రోజలుగా దాదాపు 75 గ్రామాలకు తాగునీరు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వేతనాల విషయమై పలుమా ర్లు అధికారులు,కార్మికుల మధ్య చర్చలు జరిగినా కొలిక్కిరాలేదు. పం చాయతీ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.