గజ్వేల్, ఫిబ్రవరి 9 : గజ్వేల్ మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండా అని, అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఆపలేరని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని 14, 6వ వార్డు అభ్యర్థులు గుంటుక శిరీషారాజు, స్వప్నలకు మద్దతుగా సోమవారం ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ 30ఏండ్లుగా గల్లీలో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ సహకారంతో వార్డులోని ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు.
పదేండ్లలో గజ్వేల్ రూపురేఖలు మార్చిన కేసీఆర్‌ను కాపాడుకుందామన్నారు. పట్టణంలో సమీకృత మార్కెట్, అద్భుతమైన దవాఖాన, ఐవోసీ కార్యాలయం, ఎడ్యుకేషన్‌హబ్, కుల సంఘాల భవనాలు, నాలుగు వరుసల రోడ్లు ఏర్పాటు చేసుకున్నామన్నా రు. గజ్వేల్‌ను అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.