గజ్వేల్, అక్టోబర్ 7:కాంగ్రెస్ నాయకులు డ్రామాలు ఆడుతూ అధిష్ఠానం దగ్గర మెప్పు పొందేందుకు చిల్లర రాజకీయా లు చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అక్రమంగా చొరబడి సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఫైళ్లను అపహరిస్తూ రాజకీయ లబ్ధి పొం దాలని చూస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు.
కాంగ్రెస్‌లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, పత్రికల్లో కనిపించడానికి రెండు గ్రూపుల నాయకులు నామినేటెడ్ పదవులు పొందేందుకు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఫిర్యాదులు చేసుకుంటున్నారని మండిపడ్డారు. కొంత మంది అక్రమంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చొరబడి దాడి చేయడంపై తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ వాళ్లకు పడక గ్రూపులుగా ఏర్పడి బీఆర్ఎస్పై బురదజల్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రులు, కలెక్టర్, ఆర్డీవోలు ఇవ్వాలన్నారు.
అధికారులు గజ్వే ల్ నియోజకవర్గానికి సంబంధించిన చెక్కులను తమ ఎమ్మెల్యే కేసీఆర్‌కు అం దజేస్తే 24 గంటల్లో ప్రతి లబ్ధిదారుడి ఇం టికెళ్లి అందజేస్తామని తెలిపారు. నేడు ఉదయం 10 గంటల వరకు గ్రామాల్లో ని లబ్ధిదారులకు చెక్కులు అందేవిధంగా అధికారులు చొరవ చూపాలని, లేని పక్షంలో 9వ తేదీన ఉదయం 11గంటలకు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అక్రమంగా చొరబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమావేశం లో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, మాజీ జడ్పీటీసీ మల్లేశం, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, ఆత్మకమిటీ మా జీ చైర్మన్ కృష్ణారెడ్డి, విరాసత్, శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, కనకయ్య, అత్తెల్లి శ్రీను, బొగ్గుల చందు, మామిడి శ్రీధర్, మద్ది రాజిరెడ్డి, రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.