గజ్వేల్, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికల్లో మోసపోయి కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయవద్దని, మోసపోతే ఇబ్బందులు తప్పవని అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డిని మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని 11,15, 16వ వార్డు అభ్యర్థులు కొలిచేలిమే భవాని, పుల్లా మీనమ్మ, ఆరిఫాబేగానికి మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా గజ్వేల్‌లో రూపాయి అభివృద్ధి చేయలేదన్నారు. గతంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనుల్లో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ నిర్లక్ష ధోరణి అవలంబిస్తుందన్నారు. కనీసం బస్టాండ్లు కూడా పూర్తి చేయలేని అసమర్థకాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. మరో రెండున్నరేండ్లలో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమన్నారు. మోసపోతే గోసతప్పదని ఎవరూ కూడా కాంగ్రెస్, బీజేపీలను నమ్మవద్దన్నారు. ప్రచారంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశంగౌడ్, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మాజీ సర్పంచ్ స్వామి, నాయకులు ర్యాగల దుర్గయ్య, బీరయ్య, కృష్ణాగౌడ్, సాంబ నర్సింహులు పాల్గొన్నారు.