Rabies Vaccine | మెదక్ రూరల్, జూలై 06 : శునకాల నుంచి మనుషులకు వ్యాపించే రేబీస్ వ్యాధిని టీకాలతో అరికట్టవచ్చునని మెదక్ పశువైద్య, పశుసంవర్ధక సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట్ అన్నారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలోని పశువైద్యాధికారి కార్యాలయంలో రేబీస్ వ్యాధి నివారణకు కుక్కలకు ఉచిత టీకాల పంపిణీ నిర్వహించారు.
ఇందులో 78 కుక్కలకు ఉచిత రేబీస్ వ్యాధి నివారణ టీకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేబీస్ వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి అని, ఆ వ్యాధి కుక్కల నుంచి వ్యాపిస్తుందన్నారు. ఆ వ్యాధిని నివారించేందుకు ప్రతి కుక్కకు రేబీస్ టీకాలను వేయించాలన్నారు.
ప్రతీ మూడు మాసాలు దాటిన కుక్కలకు ఉచితంగా రేబీస్ నివారణ టీకాలు వేయించాలని, ఈ టీకా పశు వైద్యశాలలో ఉచితంగా వేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ మండల పశువైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ , జేవివో సలావుద్దీన్ పాల్గొన్నారు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు