Red Cross Society | మనోహరాబాద్, మార్చి 25 : స్వచ్ఛంద సంస్థల ద్వారా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రెడ్ క్రాస్ సొసైటీ, వీఎస్టీ పరిశ్రమ ప్రతినిధులు కోరారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వీఎస్టీ పరిశ్రమ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మందికిపైగా ప్రజలకు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణమూర్తి, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్ ముదిరాజ్, వీఎస్టీ పరిశ్రమ మేనేజర్ కిషోర్‌కుమార్, కంపెనీ అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి గోపికృష్ణ, మెదక్ జిల్లా చైర్మన్ లయన్ ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర సభ్యుడు సింగం శ్రీనివాస్‌రావు, కార్యదర్శి టి. సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్, కోశాధికారి డీజీ శ్రీనివాసశర్మ, కమిటీ సభ్యులు దామోదర్‌రావు, యాదగిరి, మద్దెల సత్యనారాయణ, రమేశ్, కైలాసం, మనోహరాబాద్ పీహెచ్సీ వైద్యులు లక్షీ, జోత్య్న, సమత, బాలకృష్న, ప్రియాంక, పల్లవి, రాజేందర్‌రెడ్డి, రాధాబాయి, వీణా కుమారి, స్వర్ణలత, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
Read Also |
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?