T20 World Cup | సూపర్ 8లో ఆరు జట్లు.. మాజీ ఛాంపియన్లు ముందంజ వేసేనా..!
T20 World Cup : భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌లో అంచనాలు తలకిందులవుతున్నాయి. ఫేవరెట్లుగా బరిలోకి దిగిన జట్లులో కొన్ని అందుకోలేకపోతున్నాయి. లీగ్ దశలో చిన్న జట్లు సంచలన ప్రదర్శనతో గుబులు రేపుతుండమే అందుకు కారణం.
T20 World Cup : భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌లో అంచనాలు తలకిందులవుతున్నాయి. ఫేవరెట్లుగా బరిలోకి దిగిన జట్లులో కొన్ని అందుకోలేకపోతున్నాయి. లీగ్ దశలో చిన్న జట్లు సంచలన ప్రదర్శనతో గుబులు రేపుతుండమే అందుకు కారణం. హ్యాట్రిక్ విజయాలతో భారత్, లంక, వెస్టిండీస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్.. సూపర్ 8లో అడుగుపెట్టాయి. అయితే.. మాజీ ఛాంపియన్లు ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించేలా ఉన్నాయి. అనూహ్యంగా జింబాబ్బే, అమెరికా రేసులోకి రావడంతో చివరి రెండు బెర్తులు దక్కించుకునేది ఎవరు? అనేది ఆసక్తి రేకిత్తిస్తోంది.
పదో సీజన్ పొట్టి ప్రపంచకప్‌లో లీగ్ దశ మ్యా్చ్లు తుది అంకానికి చేరాయి. అదిరే ఆటతో ప్రత్యర్థులకు షాకిచ్చిన ఆరు జట్లు సూపర్ 8 బెర్తులు పట్టేయగా.. ఇవరి రెండు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పెద్ద జట్లు సూపర్ 8లో ఆడడం పక్కా అనుకుంటే.. చిన్నజట్లు సంచలన ప్రదర్శనతో రేసులో నిలిచాయి. గ్రూప్ సీ నుంచి వెస్టిండీస్ ఇంగ్లండ్ ముందంజ వేయగా.. గ్రూప్ డీ నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్ 8 బెర్తు సాధించాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, గ్రూప్ బీ నుంచి శ్రీలంక మాత్రమే క్వాలిఫై కాగా.. ఈ రెండు గ్రూప్‌ల నుంచి నాకౌట్ బరిలో నిలిచేది ఎవరు? అనేది ఆసక్తిగా మారింది.
The final two – who’s it going to be? pic.twitter.com/xwffNF9yvb
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2026
డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా గ్రూప్ ఏ నుంచి ముందంజ వేసింది. తొలి పోరులో యూఎస్ఏపై కాస్త కష్టంగానే నెగ్గిన టీమిండియా.. ఆ తర్వాత నమీబియా, పాకిస్థాన్‌పై పంజా విసిరి సూపర్ 8లో అడుగుపెట్టింది. రెండో బెర్తుపై కన్నేసిన పానక్కు యూఎస్ఏ గట్టిపోటీదారుగా మారింది. చివరి లీగ్ మ్యాచ్‌లో గెలుపొందిన అమెరికా ప్రస్తుతం 4 పాయింట్లతో, +0.787 నెట్రన్ రేటుతో రెండో స్థానంలో ఉంది. పాక్ ఫిబ్రవరి 18నతమ చివరి మ్యాచ్‌లో నమీబియాపై గెలిస్తేనే సూపర్ 8లో ఆడుతుంది. లేదంటే.. యూఎస్ఏ వరుసగా రెండోసారి నాకౌట్‌కు దూసుకెళ్తుంది.
ఐర్లాండ్‌పై గెలిస్తే
గ్రూప్ బీ నుంచి ఆతిథ్య శ్రీలంక దర్జాగా సూపర్ 8 చేరింది. పథుమ్ నిశాంక(100 నాటౌట్) సూపర్ సెంచరీతో సోమవారం 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన లంక.. 6 పాయింట్లతో ముందంజ వేసింది. తొలి పోరులో ఒమన్‌పై, గత మ్యాచ్‌లో ఆసీస్‌కు షాకిచ్చిన జింబాబ్వే నాలుగు పాయింట్లు, +1.984 నెట్రన్ రేటుతో రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం ఐర్లాండ్‌పై గెలిచిందంటే ఆఫ్రికా జట్టు సూపర్ 8లో అడుగుపెట్టడం ఖాయం.
అదే జరిగితే.. ఐర్లాండ్‌పై మాత్రమే గెలిచి.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన మాజీ ఛాంపియన్ ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. మిచెల్ మార్ష్ సేన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న ఒమన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిని సరే ఆసీస్‌కు 4 పాయింట్లే వస్తాయి. కాబట్టి.. ఐర్లాండ్‌పై.. జింబాబ్వే ఓడితేనే కంగారూ టీమ్ రేసులో ఉంటుంది.
New Zealand take the second 𝑸 from Group D ✅#T20WorldCup pic.twitter.com/7NyR3JTcTd
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

