రామాయంపేట, డిసెంబర్ 1: పాదచారులను వెనుకవైపు నుంచి ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన రామాయంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ వద్ద గురువారం జరిగింది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చేపూరి శ్రీకాంత్, శ్రీనివాస్ ట్రాక్టర్ రిపేర్ కోసం రామాయంపేటకు వెళ్లారు.
ట్రాక్టర్ రిపేర్‌కు ఇచ్చి నడుచుకుంటూ వెళ్తుండగా ఆటో వెనుకవైపు నుంచి వచ్చి ఢీకొన్నది. దీంతో చేపూరి శ్రీకాంత్‌కు తీవ్రగాయాలై, కోమాలోకి వెళ్లాడు. శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు కావడంతో రామాయంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్సై రాజేశ్ బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.