సిద్దిపేట అర్బన్/పాపన్నపేట, ఆగస్టు 30: ఉమ్మడి మెదక్ జిల్లాలో డెంగీ మరణాలు పెరుగుతున్నాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా తడ్కపల్లిలో డెంగీతో వివాహిత మృతిచెందింది. తడ్కపల్లినికి చెందిన సుతారి కనకలక్ష్మి(28) రెండు నెలల కింద డెంగీ బారిన పడటంతో సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో పదిరోజుల పాటు చికిత్స అందించారు.
అయినా జ్వరం తగ్గక పోవడంతో హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించారు. ఆమె వైద్యానికి కుటుంబం రూ.25 లక్షలకు పైగా అప్పు చేయాల్సి వచ్చింది. అయినా ప్రాణం దక్కలేదు.ఆరోగ్యం విషమించి గురువారం రాత్రి ఆమె మృతిచెందారు. మృతురాలికి భర్త నర్సింలు, సాత్విక్(9), చేతన్(7) అనే ఇద్దరులు కుమారులు ఉన్నారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని చీకోడ్‌లో శుక్రవారం డెంగీతో విద్యార్థి మృతిచెందాడు. చీకోడ్ గ్రామానికి చెందిన వడ్ల రాజు పెద్ద కొడుకు హర్షిత్ చారి (11) స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. వారం కిత్రం డెంగీ బారినపడగా మెదక్‌లో చిక్సిత అందించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం రాత్రి మరణించా డు.
పాపన్నపేట మండలంలో విష జ్వరాలు, డెంగీ కేసులు నమోదవుతున్నా వైద్యసిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గోవింద్ నాయ క్ ,శ్రీనివాస్ ఆరోపించారు. వారు శుక్రవా రం బాధిత విద్యార్థి ఇంటికి వెళ్లి కుటుంబం సభ్యులను పరామర్శించారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవడానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.