టేక్మాల్, అక్టోబర్ 30 : పిడుగుపాడి ఇద్దరు మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలం ధనూరలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం..బండారు బేత య్య(46), డాకూరి భరత్(16) ధనూర గ్రామ శివారులో గొర్రెలను మేపడానికి వెళ్లారు. సాయంత్రం సమయంలో అకాల వర్షం మొదలైంది. ఇద్దరు సమీపంలోని వేప చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డారు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగు పడిం ది. దీంతో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందా రు. విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి మృతదేహాలను గ్రామంలోకి తరలించారు. ఒకే ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందడంతో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.
డాకూరి భరత్ పదో తరగతి చదువుతున్నాడు. రోజూ తండ్రి శ్రీశైలం గొర్రెలను మేపడానికి వెళ్లేవాడు. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం కూడా వెళ్లాడు. ధాన్యాన్ని ఆరబెట్టడానికి వెళ్తానని, పాఠశాలకు సెలవులు కావడంతో భరత్‌ను మధ్యా హ్నం నుంచి గొర్రెలు మేపడానికి ఉంచాడు. సా యంత్రం అకాల వర్షం కురవడం, పిడుగు పడడంతో అతడిని మృత్యువు కబళించింది. దీంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.