e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home మెదక్ ఉద్యమకారుల ఫలితమే..నేడు బంగారు తెలంగాణ

ఉద్యమకారుల ఫలితమే..నేడు బంగారు తెలంగాణ

ఉద్యమకారుల ఫలితమే..నేడు బంగారు తెలంగాణ

తూప్రాన్‌ రూరల్‌, ఏప్రిల్‌ 27: సీఎం కేసీఆర్‌ కృషి ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌,టీఆర్‌ఎస్‌ తూప్రాన్‌ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. కౌన్సిలర్లు శ్రీశైలంగౌడ్‌, మామిడి వెంకటేశ్‌, పట్టణాధ్యక్షుడు సతీష్‌చారి, సీనియర్‌ నాయకులు చంద్రారెడ్డి, శ్రీనివాస్‌, యాసిన్‌లతో పట్టణంలోని తెలంగాణతల్లి విగ్ర హం వద్ద మున్సిపల్‌ చైర్మన్‌ పార్టీ జెండాను ఎగురవేశారు

రామాయంపేట రూరల్‌, ఏప్రిల్‌ 27: టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని రామాయంపేట మండలంలో ఘనం గా నిర్వహించారు. రాయిలాపూర్‌లో సర్పంచ్‌ భూమగారి నర్సాగౌడ్‌, ఎంపీటీసీ బాగ్యమ్మ,కాట్రియాల, అక్కన్నపేట, తొనిగండ్ల, జాన్సీలింగాపూర్‌, లక్ష్మాపూర్‌, డీధర్మారం, సుతార్‌పల్లి తదితర గ్రామల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీజెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణంలోని టీఆర్‌ఎస్‌ పట్టణ కౌన్సిలర్‌ యాదగిరి తన బిల్డింగ్‌ పై గులాబీ జెండాను ఎగురవేశారు. టీఆర్‌ఎస్‌ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన డాబాపై గులాబీ జెండాను ఎగురవేశారు

వెల్దుర్తి, ఏప్రిల్‌ 27. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించుకున్నారు. ఆయా గ్రామాల్లో నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. వెల్దుర్తిలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొత్త గంగాధర్‌, పార్టీ సీనియర్‌ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరమణ, మహిళానాయకురాలు ముక్తాబాయితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

చేగుంట ,ఏప్రిల్‌ 27 : టీఆర్‌ఎస్‌ అవిర్భావ వేడుకలు చేగుంట, నార్సింగితో పాటు పలు గ్రామాల్లో చేశారు. సర్పంచు ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించగా, నార్సింగి మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తౌర్యనాయక్‌ ఆధ్వర్యంలో జెండాను అవిష్కరించారు. కార్యక్రమం లో ఎంపీపీ చిందంసబిత, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు లింగారెడ్డి, సోమసత్యనారాయణ, లక్ష్మణ్‌, జర్నల్‌సింగ్‌,ఎంపీటీసీ సత్యనారాయణ, సొసైటీ చైర్మన్‌ శంకర్‌గౌడ్‌ తదితరులున్నారు.

నిజాంపేట,ఏప్రిల్‌27: మండల వ్యాప్తంగా గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాంపేట, కల్వకుంటలో టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు మల్లేశ ం, శ్రీనివాస్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమంలో నిజాంపేట పీఏసీఎస్‌ డైరెక్టర్లు అబ్దుల్‌అజిజ్‌, స్వామిగౌడ్‌, ఆత్మ కమిటీ మెంబర్‌ నాగరాజు, మాజీ సర్పంచ్‌ సత్యనారయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు లక్ష్మీనర్సింహులు, అబ్దుల్‌పాషా, శ్రీకాం త్‌, రాము ఉన్నారు.

మనోహరాబాద్‌, ఏప్రిల్‌ 27 : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం మనోహరాబాద్‌, శివ్వంపేట మండలాల్లో నిర్వహించారు. మనోహరాబాద్‌, కాళ్లకల్‌ గ్రామా ల్లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పురం మహేశ్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో పార్టీ జెండావిష్కరణ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ పురం నవనీతరవితో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉద్యమకారుల ఫలితమే..నేడు బంగారు తెలంగాణ

ట్రెండింగ్‌

Advertisement