సిద్దిపేట పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. నిత్యం రోడ్లపైకి కొత్త వాహనాలు వస్తున్నాయి. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ అలంకారప్రాయంగా మారాయి. ఈ సమస్యలు వేధిస్తుండగా పలువురు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
కలెక్టరేట్ ఎదుట రాజీవ్ రహదారిపై యూటర్న్ చేసుకోవాలంటే కిలోమీటర్ దూరం వెళ్లాల్సి ఉండడంతో చాలామంది వాహనదారులు రాంగ్ రూట్లో వాహనాలపై వెళ్తున్నారు. సామాన్యులే కాకుండా ప్రభుత్వ అధికారుల వాహనాలు సైతం రాంగ్ రూట్లో వెళ్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన
అవసరం ఎంతైనా ఉంది.
– సిద్దిపేట స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఫిబ్రవరి 10