మెదక్ జిల్లా రామాయంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ రోడ్డుపై ఇసుక సలాకాల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న పలువురికి ఇనుప సలాకాలు గుచ్చుకుని తీవ్రగాయాలయ్యాయి.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.