మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 14: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ మళ్లీ అంధకారమవుతుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్కు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 6, 7, 8వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, ఆయా వార్డుల కౌన్సిలర్లు వనజ, శంసున్నీసా బేగం, జయశ్రీ తదితరులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పద్మాదేవేందర్‌రెడ్డిని అందరూ ఆడపడుచులా ఘన స్వాగతం పలుకుతూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హారీశ్‌రావు సహకారంతో మెదక్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు.
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోని వస్తే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. మెదక్ పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇటీవలే రూ.50 కోట్లు మంజూరు చేశారన్నారు. ఆ నిధులతో మెదక్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఈ నెల 15న మెదక్‌లోని నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారన్నారు. ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలిరావాలని కోరారు. అభివృద్ధిని ఆకాంక్షించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను వివరించారు. ఆసరా ఫించన్ రూ.2016 నుంచి రూ.5 వేలకు పెంపు, అర్హులైన ప్రతి పేద కుటుంబంలోని మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా రూ.3 వేల జీవనభృతి, కేసీఆర్ బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం, రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తారని ఓటర్లకు వివరించారు. ఈ ప్రచారంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పెర్క కిషన్, ముత్యంగౌడ్, శ్రీధర్‌యాదవ్, చంద్రకళ, మాజీ ఎంఎమ్‌సీ చైర్మన్ మధుసూదన్‌రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు లింగారెడ్డి, ప్రభురెడ్డి, ప్రసాద్, కిరణ్, దుర్గాప్రసాద్, చంద్రకళ, రమేశ్, సంగ శ్రీకాంత్, బాలరాజ్, జుబేర్, పాపయ్య, బొద్దుల కృష్ణ, ఉమర్, అజ్గర్‌అలీ, వెంకటనారాయణ, సోహెల్, శంకర్, ముజీబ్, కరీం, లింగాజీ, సుధాకర్, గట్టేశ్, నగేశ్, అమీర్, ఫారూఖ్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.