వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని, 24 గంటల కరెంటు వద్దని రేవంత్‌రెడ్డి మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు. మూడు గంటల కరెంట్‌తో మూల కూడా తడవదంటున్నారు. 24 గంటల నిరంతర విద్యుత్‌తో రెండు పంటలు సంతోషంగా పండిస్తున్నామని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో గతంలో 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం 3.45 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో 1.10 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా లక్షలాది మంది రైతుల పొలాలకు నీళ్లు పారుతున్నాయి. రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన 10 హెచ్‌పీ మోటర్ల వాడకంపై ఆయన తెలివి ఏపాటిదో అర్థమవుతున్నదని ఎద్దేవా చేస్తున్నారు. ఇదంతా రైతులను మోసం చేయడానికే కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాయమాటలు అంటున్నారు.
మెదక్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంట్ ఇస్తామని చెబుతున్నది.. అది ఓ మూలకు కూడా సరిపోదు. దీంతో మళ్లీ పాత రోజులే కనిపిస్తాయి. విద్యుత్ షాక్‌లు, పాములు, తేళ్లతో మరణాలు పునరావృతం తప్పదు. రాత్రి పూట బోర్ల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుంది. రైతులకు అరిగోస తప్పదు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇలాంటి బూటకపు మాటలు మాట్లాడడం మానుకోవాలని రైతులు మండిపడుతున్నారు. రాష్ర్టంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటుతో రైతులు సంతోషంగా సాగు చేసుకుంటున్నారు.
మెదక్ జిల్లాలో గతంలో 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం 3.45 లక్షల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో 1.10 లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా లక్షలాది మంది రైతుల పొలాలకు నీళ్లు పారుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు రైతు బంధు పథకంతో పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని, 24 గంటల కరెంటు వద్దని రేవంత్‌రెడ్డి మాట్లాడడంపై ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన 10 హెచ్‌పీ మోటర్ల వాడకంపై ఆయన తెలివి ఏపాటిదో అర్థమవుతున్నదని ఎద్దేవా చేస్తున్నారు. ఇదంతా రైతులను మోసం చేయడానికే కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాయమాటంటున్నారు.
ధరణి వచ్చినందుకే సులువుగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే పొద్దున్నే పోయి బ్యాంకులో చలాను తీసుకుని, గంటల తరబడి పడిగాపులు పడేవాళ్లం. పని కాకపోతే తిరిగి ఇంటికి వచ్చే సరికి రాత్రయ్యేది. మరుసటి రోజు మళ్లీ పోవాల్సి వచ్చేది. ఇట్లా మస్తు ఇబ్బందులు పడ్డం. అక్కడ చాయి, అన్నం, గిట్లా మస్తు పైసల్ ఖర్చయ్యేవి. ధరణి వచ్చిన తరువాత మండలంలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఖర్చు కూడా తక్కువే, సమయం ఆదా అవుతున్నది. ఇలాంటి ధరణి తీసేస్తే రైతులు అరిగోస పడుతారు. అందుకే కాంగ్రెస్ వచ్చుడొద్దు, ధరణి తీసుడొద్దు.
మూడు గంటల కరెంటుతో రైతులకు ఎంతో నష్టం జరుగుతుంది. అప్పట్లో కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణ ఏర్పడినంక కరెంట్ సరఫరాను సక్కదిద్దింది బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్. తెలంగాణ వస్తే ఆగమైతమన్నరు. చీకట్లు కమ్ముకుంటయన్నరు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రింబవళ్లు ఆటంకం లేకుండా కరెంట్ ఇస్తుండు. కాంగ్రెస్ కాలంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండేవి. ఎన్నోసార్లు రైతులు కరెంట్ ఆఫీసర్లను రూమ్‌లో వేసి తాళం వేసిన రోజులు ఉన్నాయి. అప్పటి రోజులు ఇంకా గుర్తుకున్నయి. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే మూడు గంటలే కరెంట్ ఇస్తామంటున్నారు. మూడు గంటల్లో పంటలు ఎట్లా పండించాలి. ఇప్పుడు 24 గంటల కరెంట్‌తో ప్రమాదాలు తగ్గిపోయాయి. రైతులు ఇంకా కాంగ్రెస్‌ను నమ్మరు, మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటాం.
గతంలో పహాణి అవసరమై తీసుకుంటే దానిలో అనుభవదారు కాలం ఉండేది. ఒకరి పేరుపై మరోకరికి పట్టా ఉండేది. అధికారుల చేయి తడుపుతే ఎవరి పేరుపైన పట్టా మారేది. అసలు రైతుకు తర్వాత విషయం తెలిసి గొడవలయ్యేవి. ధరణి వచ్చాక పట్టా కాలం ఒకటే ఉండడంతో ఒకరి భూమిని ఇంకోకరికి మార్చేందుకు వీలు లేని పద్దతి వచ్చింది. ధరణిపై కొంతమందికి సరైన సోయి లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుర్రు. ధరణితోనే రైతులకు మేలు జరుగుతుంది.
మూడు గంటల కరెంటు ఇస్తే సాపెలువు బీడు తడవదు. అసలు రైతులు బాగుపడుడు కాంగ్రెస్‌కు ఇష్టం లేనట్లున్నది. తెల్లందాక పొద్దుందాక బావు లకాడికి పోవాలే. పురుగు ముట్టి చావాలే. రైతులు ఇప్పు డు సుఖంగా బతుకు తున్నా రు. వాళ్ల కండ్లు రైతుల మీద పడ్డాయి. రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్ అంటుండు. మరోదిక్కు 10 ఆస్పర్ల మోటర్లు అంటుండు. 10 ఆస్పర్ల మోటర్లు నీళ్లు గుంజి కొడితే భూమిలో నీళ్లుంటయా. ఎవుసం తెల్వని కాంగ్రెసోళ్లు ఏదేదో మాట్లాడుతుండ్రు. కేసీఆర్‌తోనే రైతుల బతుకులు బాగుంటాయి.
కాంగ్రెస్ సర్కారు వస్తే ధరణిని తీసేసి, భూమాత అని కొత్తది తెస్తానంటున్నారట. గిదే జరిగితే రైతు బతుకులు ఆగమాగం అవుతయ్. భూమాత తెస్తే గా పాత పద్దతి వస్తదంట. ఇక మల్ల లంచగొండి సార్లు తయారైతరు. కేసీఆర్ సారు తెచ్చిన ధరణితో మా భూములకు పైలంగా ఉన్నయ్. సర్వే నంబర్లతోటి గిప్పుడు మా భూములను ఫోన్ల సూసుకుంటున్నం. కాంగ్రెసోళ్లు తెచ్చే భూమాతపై మాకు నమ్మకం లేదు సార్. రైతులను ముంచడానికే గీ కొత్త పద్దతి తెస్తుండ్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన రైతుబంధుతో మాకు పెట్టుబడి సాయం అందుతుంది. భూమాత వస్తే అది కాస్త ఊడి మా నోట్లో మన్ను పడుతంది. అది వద్దే వద్దు.
-లస్మయ్య, రైతు, ఆవంచ, నర్సాపూర్
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో లబ్ధిపొందడానికి రైతులను మభ్య పెడుతున్నరు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకున్నదే లేదు. ఓటుబ్యాంకుగా వాడకున్నారే తప్పా.. వ్యవసాయ రంగం బాగుపడడానికి ఎ ఒక్క పథకం అమలు చేయలె. విత్తనాలు, ఎరువులు మొదలుకొని పంటలు అమ్మడానికి కూడా రైతులు ఆరిగోస పడ్డరు. సమస్యలు పరిష్కారించాలని కోరినా.. నాడు లీడర్లు పట్టించుకున్నది లేదు. పదేండ్లుగా రైతుల మేలు కోరే ప్రభుత్వం ఉన్నది. సీఎం కేసీఆర్ వల్లే రైతులు సంతోషంగా బతుకుతున్నరు. ప్రభు త్వం అందిస్తున్న 24 గంటల కరెంట్‌తో 5 హెచ్‌పీ మోటర్ల కింద పంటలకు నీరంది ంచుకుంటూ రైతులు రెండు పంటలు సాగు చేస్తు న్నరు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల భూసమస్యలు లేకుండా చేసి భూ రికార్డులను ధరణి పోర్టల్‌లో భద్రపరిచారు. భూమి అమ్మినా, కొన్నా ఫోన్‌కు మేసేజ్ వస్తుంది. ఒకవేళ భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయి డుప్లికేట్ పట్టాపాసుపుస్తకం కూడా వస్తున్నది. ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా 15 రోజుల్లో ఇంటికి పాసుపుస్తకం వస్తున్నది. ధరణి పోర్టల్ రద్దు చేస్తే దళారీలు వస్తారు. సమస్యలు పెరుగుతాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామంటున్న మూడు గంటల కరెంటుతో ఎకరం పొలానికి నీరు పారదు, బోరుబావుల్లో నీరున్న కరెంటు లేక పంటలుకు నీరందే అవకాశం ఉండదు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి ఎన్నో కష్టాలు పడ్డాం. సీఎం కేసీఆర్ సారుకు మా కష్టాలు తెలుసు. అందుకే 24 గంటల కరెంట్ ఇస్తుండు. రైతుకాబట్టి గిట్ల జేసిండు. రైతుల సంక్షేమపథకాలు తేవడం అదృష్టంగా భావిస్తున్నాం.
ధరణి పోర్టల్‌తోనే రైతులకు మేలు జరిగింది. భూ రికార్డులకు భద్రత కలిగింది. కాంగ్రెస్ ధరణిని తీసేస్తాననడం మూర్ఖత్వం. ధరణితో భూముల హక్కులపై దళారుల పెత్తనం పూర్తిగా తొలిగిపోయింది. లంచాల బాధపోయింది. రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన జరిగి వేలిముద్రల సాయంతో క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మ్యుటేషన్ కూడా వెంటనే ఇస్తున్నరు.
కాంగ్రెస్ వస్తే ఇస్తామంటున్న మూడు గంటల కరెంటుతో ఎకరం పొలానికి నీరు పారదు. బోరు బావుల్లో నీరు సరిపోదు. గతంలో కరెంట్ కోసం ఎన్ని కష్టాలు పడ్డామో రేవంత్‌రెడ్డికి ఏం తెలుసు. సీఎం కేసీఆర్ సారు మాకు 24 గంటల కరెంట్ ఇస్తుండు. ఇప్పుడు మంచిగా పొలం చేస్తుకుంటున్నాం
గత ప్రభుత్వాలు రైతులకు తీరని అన్యాయం చేసినయ్. గతంలో మేము పడిన కష్టాలు గుర్తు చేసుకుంటే శాన భయమైతాంది. తెలంగాణ ఒచ్చినంకే రైతులు జర కోలుకుంటుండ్రు. కేసఆర్ సార్ ఒచ్చినంకే పంటలకు కరంటు మంచిగ అందుతున్నది. ఏటా రెండు పంటలు పండుతున్నయ్.కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటున్న 3 గంటల కరెంట్‌తో పంటలు పండవు. రైతులకు మల్ల బీఆర్ఎస్ సర్కారే కావాలి. వేరే పార్లీ వాళ్లు వస్తే రైతులకు శానా నష్టం జరుగుతది. అందుకే రైతులంతా జర జాగ్రత్తగా ఉండాలి.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వల్ల మా భూములకు భరోసా కలిగింది. మా పెరట ఉన్న భూమి మేము సంతకం, వేలు ముద్ర పెడితే తప్ప ఇంకొకరికి మార్పుకాదు. ఇది చాలా మంచిగా ఉన్నది గతంలో ఒకరి భూమి మరోకరికి ఇష్టారాజ్యంగా మార్పు చేసేవారు. ఇప్పుడు అలా లేదు. మేము ఉన్నన్ని రోజులు మా భూమి ఇంకొకరికి పోదనే భరోసా కలిగింది. ధరణి వల్ల రైతుబంధు కూడా నేరుగా మా ఖాతాలో జమ అవుతున్నది.
రాష్ట్రం ఏర్పాటు కాకముందు భూముల గొడవలు బాగా అయ్యేవి. భూరికార్డుల ప్రక్షాళన చేసి కొత్త పట్టాదారు పుస్తకాలు ఇచ్చిన నుంచి ప్రతి పంటకు రైతు బంధు పడుతున్నది. ధరణి రద్దు చేస్తే పంట పెట్టుబడి సాయం బంద్ అవుతదని భయమైతున్నది. రైతుబీమా కూడా పోతదేమో. కేసీఆర్ తెచ్చిన ధరణితో భూముల సమస్యలు లేకుండా పోయినవి. ధరణి తీసేస్తే రైతుల బతుకులు ఆగమవుతాయి.
గతంలో మేము పడ్డ కష్టాలు గుర్తు చేసుకోవాలంటే భయమేస్తున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మేము కోలుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ పంటలకందుతున్నది. ఏటా రెండు పంటలు పండించుకుంటున్నం. కాంగ్రెస్ ఇస్తామన్న మూడు గంటల కరెంట్‌తో పంటలు పండించలేం. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రైతులకు అన్ని రకాలుగా మేలు జరుగుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం భూముల భద్రత కోసం తెచ్చిన ధరణి రైతాంగానికి సౌకర్యవంతంగా ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వస్తే ధరణి తీసేసి బంగాళా ఖాతంలో పడేస్తానంటున్నడు. దీంతో రైతుల భూములకు అభద్రతాభావం ఏర్పడింది. కైలుదారు చట్టం తెస్తే పట్టాదారులకు నష్టం కలుగుతుంది. 56 కాలాలతో భూ రికార్డులు అస్తవ్యస్తంగా తయారవుతాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో మా భూములకు భరోసా కలిగింది. జల్దిన రిజస్ట్రేషన్లు అవుతున్నయి. 15 రోజుల్లో పాస్‌బుక్ ఇంటికి వస్తున్నది. ఎవరికి లంచం ఇవ్వాల్సిన పనిలేదు. మా పేరిట ఉన్న భూమి మేము సంతకం, వేలు ముద్ర పెడితే తప్ప ఇంకొకరికి మార్పుకాదు. ఇది చాలా మంచి పద్ధతి. పట్వారీ, వీఆర్వోలు ఉన్నప్పుడు ఒకరి భూమి మరొకరికి ఇష్టమచ్చినట్లు మార్పు చేసేవాళ్లు. ఇప్పుడు అట్లా లేదు. మేమున్నన్ని రోజులు మా భూమి ఇంకొకరికి పోదు. ధరణితో మంచి జరిగింది.
ఇరువై, ముపై ఎకరాల భూస్వాములే 10 హెచ్‌పీ మోటర్ల వాడడం లేదు. మ ములుగా చిన్న సన్నకారు రైతులకు 5 హె చ్పీ వరకు సరిపో తుంది. 24 గంటల కరెంట్ అయితేనే నడు స్తుంది. ఫుల్ పోసే బోర్లకు 5హెచ్‌పీ మోటర్ సరిపో తుంది. మూడు గంటల కరెంటు ఎట్లా సరిపో తుంది. రాజకీయ లబ్ధి కోసం అవగాహన లేకుండా నాయకులు మాట్లాడడం సరికాదు. రైతులను తప్పు తోవ పట్టే అవకాశం ఉంది.