మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 25 : మెదక్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం అర్దగంట పాటు ఈదురు గాలులతో పాటు ఉరుము లు, మెరుపులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలో డ్రైనేజీలు పొంగిపోర్లాయి. ఈదురు గాలులకు కొన్ని చోట్ల ఫ్లెక్సీలు నెలకోరిగాయి. పాతబస్టాండ్ వద్ద ఓ భవనంపై గోడ కూలడంతో ఇళ్లు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణపాయం జరుగలేదు. వార్డు కౌన్సిలర్ఇంటిని పరామర్శించారు.
జోగిపేటలో భారీ వర్షం
అందోల్, ఏప్రిల్ 25 : జోగిపేటలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఉరుములు..మెరుపులతో పాటు భారీ వర్షం పడ గా మార్కెట్‌యార్డ్‌లో ధాన్యం తడిసిపోయింది. ఆర్టీసీ బస్టాప్ మొత్తం నీటితో నిండిపోగా, రోడ్డపై భారీగా వరద నీరు చేరింది.
ఆర్సీపురంలో 6.3సెంటీ మీటర్ల వర్షపాతం
రామచంద్రాపురం,ఏప్రిల్ 25 : ఆర్సీపురంలో 6.3 సెంటి మీటర్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లన్ని జలమయం అ య్యాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
రోడ్డుపై పడిన ట్రాన్స్ఫార్మర్
కోహీర్, ఏప్రిల్ 25: కోహీర్‌లో ఈదురు గాలుల వీయడంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రోడ్డుపై పడింది. మంగళవారం కోహీర్‌లో మోస్తరు వర్షం తో పాటు తీవ్రమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. విద్యుత్ తీగలు కూడా తెగి కిందపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్‌కో సిబ్బం ది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడిన ట్రాన్స్ఫార్మర్ను తొలగించారు.