పాపన్నపేట, ఏప్రిల్ 23: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.