సదాశివపేట, ఫిబ్రవరి 7 : గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండలపరిధిలోని నందికంది గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యానికి సం బంధించిన సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. గ్రామంలో నాటి న మొక్కలను రక్షించుకోవాలని, మహిళలు తడి,పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించే విధంగా కృషి చేయాలన్నారు.
గ్రంథాలయ ఏర్పాటుకు అవసరమైన భవనం, స్థలం గుర్తించాలని, గ్రంథాలయం యువత, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంగన్వాడీ కేంద్రం లో సామ్, నామ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పౌష్టికాహారం అందించి, పోషణ లోపంలేని పిల్లలు ఉం డేలా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. కార్యక్రమంలో ఎల్‌పీవో సతీశ్‌రెడ్డి, ఎంపీడీవో పూజ, ఎంఈవో, తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.