పటాన్చెరు, మే 25: రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామ పంచాయతీలను ఇటీవల మున్సిపాలిటీలుగా మార్చింది. కొత్త మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బందిని నియామకం జరగక పోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీలను మున్పిపాలిటీలుగా ప్రభు త్వం అప్‌గ్రేడ్ చేసింది. జిన్నారం మండలంలోని గడ్డపోతారం గ్రామాన్ని మున్పిపాలిటీగా ఏర్పాటు చేసింది. గడ్డపోతారం మున్సిపాలిటీలో జిన్నారం మండలంలో ఉన్న ఖాజీపల్లి, వాయిలాల, లక్ష్మీపతిగూడం, మాదారం పం చాయతీలతో మున్సిపాలిటీని ఏర్పాటు చేసిం ది.
గడ్డపోతారం మున్సిపాలిటీగా మారిన తర్వాత సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మున్సిపాలిటీకి కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. అభివృద్ధ్ది, సంక్షేమ పథకాల పర్యవేక్షణ కోసం మిగతా అధికారులు, సిబ్బందిని నియమించక పోవడంతో పాలన సరిగ్గా సాగడం లేదు. గడ్డపోతారం మున్సిపల్ కార్యాలయానికి డీఈ, ఏఈ, టీపీవో, మేనేజర్‌తో పాటు ఇతర సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌తో పాటు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు.
అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం డీఈ, ఏఈ పోస్టులు మంజూరు చేసినా, భర్తీ కాలేదు. ఇన్చార్జి డీఈ ఒకరు పనిచేస్తున్నారు. ఏఈ పోస్టు ఖాళీగా ఉంది. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు గడ్డపోతారం మున్సిపల్లో పనిచేస్తున్నారు. వీరు ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. పారిశుధ్య పనులు పర్యవేక్షణ కోసం శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. పారిశుధ్య ప నులు పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. ఈ మున్సిపల్ పరిధిలో 13వేల జనాభా ఉంది.
సమస్యల పరిష్కారంలో అధికారుల విఫలం?
గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో ఖాజీపల్లి, వాయివాల, లక్ష్మీపతిగూడెం, మాదారం గ్రా మాలున్నాయి. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు 3 నుంచి 5 కిల్లోమీటర్ల దూరంలో ఉంటాయి. తాగునీరు, పారిశుధ్యంతో ఈ గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్తి పన్ను వసూలు పర్యవేక్షణ చేసేందుకు రెవెన్యూ అధికారి, మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బిల్ కలెక్టర్లు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రజలు జన్మదిన ధ్రువీకరణ, ఆస్తి పన్నులు చెల్లింపు, ఇంటి అనుమతులు, కొత్త ఇంటి నంబర్ కోసం కార్యాలయం చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉంది.
సమస్యలు పరిష్కరిస్తాం..
గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిపించేందుకు కృషిచేస్తున్నాం. ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బందిని నియమించలేదు. ఉన్న సిబ్బందితోనే పాలన సాగిస్తు న్నాం. ఆస్తి పన్నులు 96శాతం వసూలు చేశాం. తాగునీటి సమస్య లేకుండా పర్యవేక్షిస్తున్నాం. మున్సిపల్ పరిధిలో పరిశ్రమలు ఉన్నా యి. వాటి నుంచి ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నాం. ప్రజలు సమస్యలుంటే నేరుగా కార్యాలయానికి రావాలి.
– జైతురాం నాయక్, మున్సిపల్ కమిషనర్ గడ్డపోతారం