సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని శుభం గార్డెన్స్‌లో ఆదివారం నియోజకవర్గ స్థాయి బీఆర్టీయూతో పాటు దాని అనుబంధ సంఘాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితెల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో కార్మికులు, కర్షకులు, చేతివృత్తుల జీవితాల్లో పెనుమార్పులు వచ్చాయన్నారు. కార్మికులకు బీమా సౌకర్యంతో పాటు ఇతర సంక్షేమ పథకాలన్నీ వర్తించేలా కృషిచేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికులకు ఉపాధి దొరుకుతున్నదన్నారు. అబద్ధాల కాంగ్రెస్ నాయకుల మాటలు వింటే మళ్లీ పదేండ్లు వెనక్కి పోయి కరువుకు స్వాగతం పలికినట్లేనని, ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
హుస్నాబాద్, అక్టోబర్ 29: రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో కార్మికులు, కర్షకులు, చేతివృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నిండాయని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కమార్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని శుభం గార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి బీఆర్టీయూతో పాటు దాని అనుబంధ సంఘాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఏడు మండలాల నుంచి భారీ సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు. మాజీ మంత్రి, ఎన్నికల ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి, బీఆర్టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రూప్‌సింగ్‌తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. కార్మికులకు బీమా సౌకర్యంతో పాటు ఇతర సంక్షేమ పథకాలన్నీ వర్తించేలా కృషిచేశామన్నారు. 2014కు ముందు కార్మికులు పనిచేసేందుకు కూడా పనిదొరికేది కాదని, ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పంటలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెంది కార్మికులకు ఉపాధి దొరుకుతున్నదన్నారు. కాంగ్రెస్ చెప్పే మాటలు వింటే మళ్లీ పదేండ్లు వెనకకు పోయి కరువు విలయతాండవం చేస్తున్నదన్నారు. కార్మికులు, కర్షకులు ఇతర పార్టీలకు ఓటు వేయకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్కు ఓటు వేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీ మెజార్టీని ఇవ్వాలని కోరారు. ఆత్మీయ సమ్మేళనానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎడబోయిన రజనీతిరుపతిరెడ్డి, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ దండుగుల రాజ్యలక్ష్మి, బీఆర్టీయూ నియోజకవర్గ అధ్యక్షుడు రమేశ్, వివిధ కార్మిక సంఘాలు, బీఆర్ఎస్ నాయకులు రాజలింగం నాయక్, ఇంద్రాల సారయ్య, పెసరు సాంబరాజు, బొమ్మగాని శ్రీనివాస్, రాజునాయక్, తిరుపతినాయక్, ఎడబోయిన తిరుపతిరెడ్డి, ఆకుల వెంకట్, చొప్పరి శ్రీనివాస్, క్రాంతిరెడ్డి, విజయభాస్కర్, ఏడు మండలాల నుంచి తరలివచ్చిన కార్మికులు, మహిళా కార్మికులు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎల్లవేళలా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న వొడితెల సతీశ్‌కుమార్ కారుగుర్తుకు ఓటు వేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరవేయడంలో కార్మికలోకం భాగస్వాములు కావాలని బీఆర్టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రూప్సింగ్ పిలుపునిచ్చారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా కార్మికులకు లబ్ధి చేకూర్చడంతో పాటు కార్మిక చట్టాల అమలుకు కృషి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కార్మికులంటే ఒక్కతాటిపై, ఒక్కమాటపై ఉండేవారన్నారు. వచ్చే ఎన్నికల్లో కార్మికుల ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న సతీశ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల సం క్షేమ నిధిని ఏర్పాటు చేసి, కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. ప్రతి కార్మికుడికి గృహలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు అందజేస్తామని తెలిపారు. కర్ణాటకలో 5గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ ఇక్కడ ఉచిత విద్యుత్ ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెబు తున్నదని విమర్శించారు. సుమారు 2వేల మందిని బలి తీసుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అవసరం లేదని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించాలన్నారు. కార్మికులు, కర్షకులంతా ఐక్యంగా ఉండి సతీశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించి, కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.