పల్లెకు శోభ.. ప్రకృతికి ప్రాణం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లెపల్లెన ఏర్పాటు చేసిన ప్రకృతివనాలు ఆహ్లాదాన్ని పంచుతూ కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉన్న చోట ఈ వనాలను ఏర్పాటు చేశారు.
- ఆహ్లాదాన్ని పంచుతున్న వనాలు
- సేద తీరుతున్న పల్లె ప్రజలు
- పిల్లల కోసం క్రీడా పరికరాలు
కొల్చారం, మే 30: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లెపల్లెన ఏర్పాటు చేసిన ప్రకృతివనాలు ఆహ్లాదాన్ని పంచుతూ కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉన్న చోట ఈ వనాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేని గ్రామాల్లో అటవీ భూములను సేకరించి పల్లె ప్రకృతి వనాలను పెంచారు. మూడేండ్ల క్రితం నాటిన మొక్కలు నేడు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో అందులో ప్లిలలు ఆడుకోవటానికి క్రీడా సామగ్రిని సైతం ఏర్పాటు చేశారు. మొక్కల సంరక్షణ బాధ్యతలను వన సంరక్షణ సేవకులకు అప్పగించారు. కూర్చోవడానికి బెంచీలు సైతం ఏర్పాటు చేశారు. మొక్కలు, ప్రకృతి వనాల వివరాలు తెలిపేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు రోజూ సాయంత్రం ప్రకృతి వనాల్లో సేద తీరుతూ ఉల్లాసం పొందుతున్నారు.

21 గ్రామాల్లో పచ్చని వనాలు
కొల్చారం మండల వ్యాప్తంగా 21 గ్రామ పంచాయతీలుండగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పల్లె ప్రకృతి వనానికి ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలు కేటాయించగా, రూ.3 లక్షలతో సామగ్రి, మొక్కల కొనుగోలు, మరో రూ.2 లక్షలు కూలీల వేతనాల కోసం వెచ్చించారు. ఏపుగా పెరిగే మొక్కలను వనం చుట్టూరా నాటించారు. మధ్యలో వేప, జామ, కానుగ, గుల్మోహర్లతో పాటు పూల మొక్కలు, ఔషధ మొక్కలను నాటారు.
మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నీటిని అందించడంతో మొక్కలు ఏపుగా పెరిగి స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అందుబాటులో ఉన్న నిధులు, మరి కొన్ని గ్రామాల్లో దాతల సహకారంతో పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన క్రీడా సామగ్రిని అమర్చారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా పల్లె ప్రకృతి వనాల్లో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నారు. పిల్లలు క్రీడా మైదానాలుగా ఉపయోగించుకుంటున్నారు. మొక్కల మధ్య నుంచి వేసిన వాకింగ్ ట్రాక్‌ను పెద్దలు వినియోగించుకుంటున్నారు. మండలంలోని పోతంశెట్‌పల్లి, ఎనగండ్ల, సీతారాంతండా, సంగాయిపేట, పైతర, అంసాన్పల్లి, పోతిరెడ్డిపల్లి, కొంగోడు గ్రామాల్లో మొక్కలు బాగా ఎదిగి ఆహ్లాదకర వాతావరణాన్ని ఇస్తుండగా, పైతర పల్లె ప్రకృతి వనంలో క్రీడా సామగ్రి అమర్చడంతో మండలంలోనే ఆదర్శంగా నిలిచింది.
కనువిందు చేస్తున్నాయి
పట్టణాల్లోనే పార్కులు చూశాం. సీఎం కేసీఆర్ మూడేండ్ల క్రితం శ్రీకారం చుట్టిన పల్లె ప్రకృతి వనాలు నేడు పల్లెకు కొత్త శోభను తీసుకువస్తున్నాయి. పచ్చదనంతో కూడిన ఆహ్లాద వాతావరణంలో చిన్నాపెద్ద తేడాలేకుండా ఉదయం, సాయంత్రం సేద తీరుతున్నారు.
– విష్ణువర్ధన్‌రెడ్డి,ఏటిగడ్డమాందాపూర్ సర్పంచ్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

