ములుగు, జూలై 9 : పాల బిల్లులు చెల్లించడం లేదంటూ విజయ డెయిరీ పాల విక్రయదారులు మంగళవారం ఆందోళన చేపట్టారు. సిద్దిపేట డిల్లా ములుగులోని విజయ డెయిరీలో పాల ను విక్రయిస్తున్న రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 రోజులకోసారి బిల్లులు చెల్లించే వారని, ఇప్పుడు 6 నెలలు గడుస్తున్నా పాల బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము పశుపోషణకు, కుటుంబ అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపా రు. వెంటనే పాల బిల్లులను చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.