నరోత్తంకు సముచిత స్థానం
ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఏర్పుల నరోత్తంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు నియమకపత్రాన్ని నరోత్తంకు అందజేశారు.
- రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి
- కార్పొరేషన్ చెర్మన్‌గా నియమించిన ప్రభుత్వం
- ఉత్తర్వులు అందజేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు
- సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటానన్న చైర్మన్
జహీరాబాద్, సెప్టెంబర్ 8: ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఏర్పుల నరోత్తంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు నియమకపత్రాన్ని నరోత్తంకు అందజేశారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు శుక్రవారం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్‌లో ఉన్న నరోత్తం ఇటీవల సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ గ్రామానికి చెందిన నరోత్తం నీటిపారుదల శాఖలో డీఈఈగా పని చేస్తూ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి రాజకీయల్లోకి వచ్చారు.
2009లో జహీరాబాద్ నియోజకవర్గ ప్రాతినిథ్యాన్ని ఎస్సీలకు కేటాయించడంతో నరోత్తం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నరోత్తం బీఆర్ఎస్లో చేరిన తర్వాత కార్పొరేషన్ పదవి రావడంతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ అభివృద్ధికి, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో ఎస్సీ కార్పొరేషన్ చైర్మగా నియమించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

