సదాశివపేట, సెప్టెంబర్ 23: దేశ భవిష్యత్తు, నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని, విద్యతోనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో గురుపూజోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ నియోజకవర్గస్థాయి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు మెమోంటోలు అందజేసి, శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యనందిస్తున్నాయన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయుడు మార్గదర్శకుడని, ఒక్కో ఉపాధ్యాయుడు తన జీవితంలో వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.
రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. కాగా ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల కోసం గురుపూజోత్సవం నిర్వహించడంపై ప్రైవేటు పాఠశాలల సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చింతా ప్రభాకర్ విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, ఎంఈవో అంజయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చీల మల్లన్న, ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఆరిఫోద్దీన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.