గజ్వేల్, మే 27: తెలంగాణ రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ధాన్యం కొనుగోలులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. బుధవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ ఎదుట చేపట్టిన రైతుదీక్షలో పాల్గొన్న అనంతరం మార్కెట్లో తడిసిన ధాన్యం బస్తాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
రైతుదీక్షలో వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ రైతుల ఆత్మగౌరవం పెంచారని, రైతులను రాజుగా చూడాలనే ప్రాజెక్టులు నిర్మించి సాగునీళ్లు అందించారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, పెట్టుబడిసాయం, కాలానికి ముందే విత్తనాలు , ఎరువులు అందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఆనాడు గుంట అమ్మితే కూతురు పెళ్లి వైభవంగా చేసేవారని, నేడు అందుకు భిన్నంగా పరిస్థితులను మార్చిన ఘనత రేవంత్‌రెడ్డికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై అన్నివర్గాలకు విసుగు వచ్చిందని, ఎప్పుడు దిగిపోతాడోనని ఎదురు చూ స్తున్నారన్నారు.

కేసీఆర్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వర్గల్లో 1200 ఎకరాలు సేకరించి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తే, కాంగ్రెస్ నాయకులు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రెండు భారీ రైస్‌మిల్లులు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు దందాలు తప్పా ప్రజా సమస్యలు పట్ట డం లేదని విమర్శించారు. ఎక్కడ పరిశ్రమలు పెడితే, అక్కడ మట్టి దందాలు, చైర్మన్ పదవులు, పార్టీ పదవులను డబ్బులకు అమ్ముకోవడంపై ఉన్న ధ్యాస.. ప్రజా సమస్యలపై లేదని ఎద్దేవా చేశారు. పెండింగ్ కాలువల పనులు పూర్తి చేయడం లేదని, కనీసం అధికారులు సమీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని విమిర్శించారు.
గజ్వేల్ పరిధిలో ఇప్పటి వర కు రైతుల నుంచి 30శాతం వడ్లు మాత్రమే కొన్నార, ఇంకా 70శాతం వడ్లు కల్లాలు, కొ నుగోలు కేంద్రాలు, రోడ్ల వెంట ఉన్నాయని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు, రాశులు తడిసి ముద్దాయ్యయని, తడిసిన ధాన్యం మ్యాచర్ లేకుండా చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ధాన్యం కొనాలని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
మున్సిపల్ చైర్పర్సన్ చందన, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాయకులు దేవీ రవీందర్, జుబేర్‌పాషా, చంద్రమోహన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మధు, నవాజ్‌మీరా, కుమార్, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు వెంకటేశంగౌడ్, ఇంద్రసేనారెడ్డి, రామకృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీలు అర్జున్‌గౌడ్, బొల్లారం ఎల్లయ్య పాల్గొన్నారు.