Home
Medak
The Foundation Stone Of The Electric Battery Unit Will Be Laid By Ktr Minister Of It Industries And Municipal Departments On 24th Of This Month
రెడ్ కార్పెట్ పెట్టుబడులకు రాజమార్గం
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. పారిశ్రామిక వేతలను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీలు కల్పిస్తున్నది. ‘మేకిన్ తెలంగాణ’ అని పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నది.
- మేకిన్ తెలంగాణకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్
- పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా..
- మహీంద్రా అండ్ మహీంద్రాలో మౌలిక సదుపాయాలు
- పన్నులు రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వం
- 2015లో ఆటోమేటివ్ అదనపు ప్లాంటు ప్రారంభం
- తెలంగాణ ఉద్యోగార్థులకు అవకాశాలు
- 24న అదే ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ బ్యాటరీల ఉత్పత్తి ప్లాంట్‌కు శంకుస్థాపన
- హాజరుకానున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు రెడ్ కార్పెట్ వేస్తున్నది. మేకిన్ తెలంగాణలో భాగంగా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండగా, ఆయా పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తున్నది. జిల్లాలోని జహీరాబాద్లోనూ పరిశ్రలు స్థాపించేందుకు ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుండడంతో, పెద్దపెద్ద పరిశ్రలు
తరలివస్తున్నాయి.
జహీరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. పారిశ్రామిక వేతలను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీలు కల్పిస్తున్నది. ‘మేకిన్ తెలంగాణ’ అని పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నది. పరిశ్రమలు స్థాపనకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు సీఎం కేసీఆర్, ఐటీ, పరిశ్రమశాఖల మంత్రి కేటీఆర్ అనుమతులు ఇస్తున్నారు. పరిశ్రమకు కావాల్సి భూమి, నీరు, విద్యుత్ ఇతర అన్ని రకాల వసతులు, కేటాయింపులు చేస్తున్నారు. 2015లో జహీరాబాద్ మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమేటివ్ ప్లాంట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రూ.250 కోట్లతో తెలంగాణలో మొదటి ఆటోమేటివ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ యాజమాన్యాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించారు. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుంది. పరిశ్రమల స్థాపనకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 10 నుంచి 12 రోజుల్లో అన్ని రకాల క్లియరెన్స్ ఇస్తుంది. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు జారీ చేస్తున్నది.
రూ.1,100 కోట్లతో ఆటోమేటివ్ ప్లాంట్..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రాలో అదనంగా దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను విస్తరించి ఆటోమేటివ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు యజమయ్యానికి రాయితీలు కల్పించారు. ఈ ప్లాంట్‌లో 3500 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. ఆటోమేటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌లో నాలుగు, మూడు చక్రల వాహనాలు తయారు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ 2015లో మహీంద్రా ప్లాంట్‌లో పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ టైరెక్టర్ డాక్టర్ పవన్ గోయెంకా, ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షాలతో కలిసి ప్లాంట్‌ను ప్రారంభించి, మహీంద్రాలో ఉత్పత్తి చేసిన నాలుగు చక్రల ఆటోను సీఎం కేసీఆర్ నడిపి మార్కెట్లోకి విడుదల చేశారు. రాష్ర్టంలో మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమల్లో కొత్త ప్లాంట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ రాయితీలు అమలు చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమతో జహీరాబాద్‌కు ప్రపంచంలో గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఈ పరిశ్రమల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ర్టలకు చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారు. స్థానికులు వేలాది మంది పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు.

ఎలక్ట్రిక్ల బ్యాటరీ యూనిట్‌కు శంకుస్థాపన
జహీరాబాద్ మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమేటివ్ ప్లాంట్‌లో నూతనంగా ఎలక్ట్రిక్ల్ బ్యాటరీ యూనిట్‌కు ఈ నెల 24న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మహీంద్రాలో ఇప్పటికే పలు వాహనాలు ఉత్పత్తి చేస్తున్నారు. మార్కెట్లో ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలకు డిమాండ్ పెరిగిపోవడంతో సంస్థ కొత్తగా యూనిట్ నిర్మాణం చేస్తున్నది. జహీరాబాద్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే వాహనాలు ప్రపంచంలోని పలు దేశాల్లో అమ్మకాలు చేస్తున్నారు.
మహీంద్రా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు
మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమకు అనుబంధంగా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వాహనాల తయారీకి కావాలసిన పరికరాలు బుచినెల్లి శివారులోని పారిశ్రామికవాడలో తయారు చేస్తున్నారు. గతంలో మహీంద్రా ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే వాహనాలకు కావాలసిన పరికరాలను మహారాష్ర్ట నుంచి దిగుమతి చేసుకునే వారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయిన్నాయి. వాహనాలకు కావాలసిన ప్రతి ఒక్కటి జహీరాబాద్ ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఎంతో మందికి ఉత్పత్తి అవకాశాలు వస్తున్నాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ర్టతో పాటు పలు రాష్ర్టాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు జహీరాబాద్‌లో మహీంద్రా అనుబంధ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించింది. జహీరాబాద్‌ను ఒక ఆటోమొబైల్ హబ్‌గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఎంతో మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కాలుష్యం లేని ఆటోమొబైల్ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

