మువ్వన్నెల జెండాల రెపరెపలతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పల్లెలు, పట్టణాలు త్రివర్ణ శోభితమయ్యాయి. గురువారం 74వ గణతంత్ర దినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సంబురాలు అంబరాన్నంటాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ శరత్, మెదక్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జాతీయ జెండావిష్కరణలు చేసి, గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమాల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో జాతీయ సమైక్యత వెల్లివిరిసింది. పటాన్చెరు తహసీల్దార్, ఎంపీపీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాలు, మైత్రి మైదానంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి. నారాయణఖేడ్, అందోల్, నర్సాపూర్, జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు మహారెడ్డి భూపాల్‌రెడ్డి, క్రాంతి కిరణ్, మదన్‌రెడ్డి, మాణిక్‌రావులు జెండావిష్కరణలు చేశారు.
-మెదక్/సంగారెడ్డి న్యూస్‌నెట్ వర్క్ , జనవరి 26
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది . సంగారెడ్డి కలెక్టరేట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం కలెక్టర్ శరత్ గౌరవ వందనం స్వీకరించారు. మెదక్ కలెక్టరేట్లో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సంబురాలకు అదనపుకలెక్టర్లు ప్రతిమాసింగ్ , రమేశ్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ముఖ్యఅతిథుగా హాజరయ్యారు. మువ్వన్నెల జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో జాతీయ సమైక్యతా వెల్లివిరిసింది. స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. కొందరు చిన్నారులు స్వాతంత్య్ర పోరాట యోధులు, జాతి నాయకుల వేషధారణలో ముస్తాబై జెండావందనం చేయడం ద్వారా అందరిలో దేశభక్తిని ప్రేరేపింపజేశారు.
-మెదక్/సంగారెడ్డి జిల్లాల నెట్వర్క్ ,నమస్తే తెలంగాణ జనవరి 26