సిద్దిపేట, డిసెంబర్ 22: సిద్దిపేట కళలకు కాణాచి అని, తెలంగాణ సాంసృతిక వైభవాన్ని ప్రతిఒకరూ ఆచరిస్తూ ముందుకు సాగాలని సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శాడ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా యువజన సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో యువజన సంక్షేమ, క్రీడల శాఖ అధికారి జొన్న ల నాగేందర్ అధ్యక్షతన యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాడ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట ఖ్యాతి ని యువత జాతీయ స్థాయిలో నిలపాలన్నారు. దేశంలో యువత ప్రాధాన్యం అమోఘమన్నారు. యువతలో దాగిఉన్న శక్తిని వెలికితీయడానికి ఇలాంటి యువజన ఉత్సవాలు ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం జాతీయ యువజన అవార్డు గ్రహీత, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యుడు దేశబోయిని నర్సింహులు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన యువజన పాలసీని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ఎంపికైన ఎనిమిది విభాగాల వారి ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే యువజనోత్సవలకు పంపించనున్నా రు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర అకౌంటెంట్ కిరణ్కుమార్, యువజన అవార్డు గ్రహీతలు సుభాష్ చంద్రబోస్, అధికం రాజు, న్యాయ నిర్ణేతలు బాలకిషన్, మహేందర్, ముకపల్లి శ్రీనివాస్, స్వామి కన్నా, యువజన సంక్షేమ శాఖ సిబ్బంది శ్రీనివాస్ గౌడ్, నాగార్జున, ప్రవీణ్, జైన్ విజయ్, తదితరులు పాల్గొన్నారు.