నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 28 : కుమ్మెర ఘటనకు కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కుమ్మెర బాధితుల న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లో ఐకాస కన్వీనర్ బోనాసి రాంచందర్, కోకన్వీనర్లు పర్వతాలు, శివ, శ్రీను, కాశన్న, శివశంకర్‌యాదవ్, నిజాం, రామయ్య, మధు, నవీన్, అశోక్, కళ్యాణ్, పృథ్వీరాజ్, వెంకటయ్య, రామకృష్ణ, తారాసింగ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతల కుమ్మెర పర్యటన.. నిజాలను సమాధి చేసేలా ఉందని విమర్శించారు. ఎంపీ మల్లురవి కుమ్మెర బాధితుల పక్షమా? లేక నిందితుల పక్ష మా? అన్నది తేల్చాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు నాగర్‌కర్నూల్ కేంద్రంగా రిలే దీక్షలు, శాంతి ర్యాలీ లు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్ట డి తదితర కార్యక్రమాలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.