బిల్లు వచ్చేనా.. పనులు పూర్తయ్యేనా!
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో అత్యాధునిక హంగులతో కోర్టు భవన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అప్పట్లో కోర్టు భవన నిర్మాణ పనులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన తర్వాత ప్రారంభంలో పనులు చకచకా సాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోర్టు భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి.
- గజ్వేల్‌లో అసంపూర్తిగా కోర్టు భవన నిర్మాణం
- శిథిలావస్థలో ప్రస్తుత కోర్టు భవనం
- తాత్కాలికంగా ఐవోసీ ఏ బ్లాక్‌లోకి తరలింపునకు అనుమతి
గజ్వేల్, మే 24: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో అత్యాధునిక హంగులతో కోర్టు భవన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అప్పట్లో కోర్టు భవన నిర్మాణ పనులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన తర్వాత ప్రారంభంలో పనులు చకచకా సాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోర్టు భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. శిథిలావస్థలో ఉన్న ప్రస్తుత కోర్టు భవనంలో వర్షాకాలంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకుంటుందోనని ఉద్యోగులు, సిబ్బంది భయపడుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో నిధులు మంజూరు..
గజ్వేల్ రింగ్‌రోడ్డు పక్కన కోర్టు నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ రూ. 29కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు ఐదెకరాల స్థలాన్ని కేటాయించారు. ఒకే ప్రదేశంలో అత్యధునిక హంగులతో కోర్టు భవనం, జడ్జిల నివాస గృహాలు, బార్ అసోసియేషన్ గది, పోలీసుల విశ్రాంతి గది, కోర్టుకు వచ్చే వారి కోసం భవన నిర్మాణ పనులు 2023లో ప్రారంభించారు. ఏడాది వరకు పనులు చకచకా ముందుకు సాగాయి. కోర్టు భవనం సెల్లార్, జీప్లస్-2 పద్ధ్దతిలో నిర్మాణ పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం స్లాబ్‌లు పూర్తయ్యాయి.
బిల్లుల మంజూరులో జాప్యంతో కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే ఆపేశారు. స్లాబ్‌ల దశలో ఉన్న భవన పనులు తిరిగి మళ్లీ ప్రారంభం కావాలంటే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని బిల్లులు మంజూరు చేస్తే నిర్మాణ పనులు ముం దుకు సాగే అవకాశం ఉంది. భవన నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్ ఫైనల్ చేయాల్సి ఉం ది. బిల్లులు మంజూరుకు స్థానిక నాయకులు ప్ర భుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని న్యాయవాదు లు కోరుతున్నారు. ఇరుకు గదుల్లో కొనసాగుతు న్న ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం శిథిలావస్థకు చేరడంతో వర్షాకాలంలో విధులు నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
తాత్కాలికంగా ఐవోసీ ఏ-బ్లాక్‌లోకి తరలింపునకు అనుమతి…
శిథిలావస్థకు చేరిన కోర్టు భవనం భారీ వర్షాలకు గతేడాది పెచ్చులూడి పపడంతో అందులోని ఉద్యోగులు భయం భయంతో విధులు నిర్వహిస్తున్నారు. వర్ష్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం తాత్కాలికంగా కోర్టును ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్(ఐవోసీ) భవనంలోని ఏ-బ్లాక్‌లోకి తరలించేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. నూతన కోర్టు భవనం పూర్తయ్యే వరకు ఏ-బ్లాక్‌లో కోర్టు కొనసాగేలా అనుమతి ఇచ్చారు. కోర్టును ఐవోసీ ఏ-బ్లాక్‌లోకి తరలించేందుకు జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షణ చేసిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏ-బ్లాక్‌లోని ఎంపీపీ సమావేశ మందిరం, గదులను కోర్టుకు అనువుగా పునరుద్ధరించాల్సి ఉంటుంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

