హవేళీఘనపూర్, సెప్టెంబర్ 21 : హవేళీఘనపూర్ మండలం గంగాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో 45 ఏళ్ల పైబడిన గుర్తు తెలియని వ్యక్తి శవం లభించినట్లు హవేళీఘనపూర్ ఎస్ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.
గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించగా మెదక్- రామాయంపేట రోడ్డు పక్కనే ఉన్న గుంతలో మృతుడు గత నాలుగైదు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి ఆనవాళ్లు ఎవరికైనా తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ శేఖర్‌రెడ్డి కోరారు.