పదకొండో విడత రైతుబంధు పంపిణీ సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎకరాలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వేసింది. రైతుబంధు పథకం రైతులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం ఏటా రెండు పంటలకు పంట పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు ఆర్థిక ధీమాను కల్పిస్తున్నది.
నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. వాటిని తీసుకుని రైతులు మురిసిపోతున్నారు. విత్తనాలు, ఎరువులు తదితరాలను కొనుగోలు చేస్తూ సంబురంగా సాగు చేసుకుంటున్నారు. పంట పెట్టుబడుల కోసం రైతులు ఎదురు చూడకుండా విత్తు విత్తక ముందే సీఎం కేసీఆర్ పెట్టు బడిసాయాన్ని అందిస్తున్నారు.
– సంగారెడ్డి/ మెదక్ జిల్లాల నెట్వర్క్, జూన్ 26