సిద్దిపేట, మే 14: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మెదక్ లోక్‌సభ పరిధిలో పోలింగ్‌లో పాల్గొని ఓటుహకు వినియోగించుకున్న ప్రజలందరికీ మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుతో తమ నిర్ణయాన్ని వెలిబుచ్చే ఈ పవిత్ర కార్యంలో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించిన మెదక్ పార్లమెంటు పరిధిలోని ఓటరు మహాశయులకు, పోలింగ్‌ను ప్రశాంతంగా కొనసాగించిన అధికారులు, పోలీసులందరికీ హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మెదక్ పార్లమెంటు పరిధిలో దాదాపు 50 రోజుల పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, ఎన్నికల షెడ్యూ ల్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ వరకు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకూ మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.