నిజాంపేట, సెప్టెంబర్ 8: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లాలోని నిజాంపేట మలక చెరువు మత్తడి వద్ద బ్రిడ్జ్ కూలిన విషయం విధితమే. ఈ మేరకు సోమవారం ఆర్ అండ్ బి అధికారులు చేపడుతున్న తాత్కాలిక రోడ్డు పనులను ఎంపీడీవో రాజిరెడ్డి ఆర్ ఐ ప్రీతి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరాములు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు, ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో నిజాంపేట- నస్కల్ రోడ్డు మార్గంలో మల్క చెరువు వద్ద కూలిన బ్రిడ్జికి మరమ్మత్తులు ప్రారంభించామన్నారు.
తాత్కాలికంగా మరమత్తు చేస్తున్న ఈ రోడ్డు పనుల వల్ల ప్రయాణికుల సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్, మాజీ పాక్స్ చైర్మన్ దేశెట్టి లింగం, నాయకులు రమేష్, లక్ష్మా గౌడ్ తదితరులు ఉన్నారు