రామాయంపేట, ఫిబ్రవరి 5: తెలంగాణలో కేసీఆర్ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం రామాయంపేట పట్టణంలోని వేంకటేశ్వర స్వామి పుష్కర ఉత్సవాలకు హాజరై స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వారు వేర్వేరుగా మాట్లాడుతూ తెలంగాణలో ఆలయాలు అభివృద్ధి చెందాయంటే అది కేవలం కేసీఆర్ వల్లేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలోని ఆలయాలు జీవం పోసుకున్నాయన్నారు.
మెదక్ నియోజకవర్గంలోని మెదక్, రామాయంపేట, పాపన్నపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాల్లోని ఆలయాలకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారని చెప్పారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వేర్వేరుగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పల్లె జితేందర్‌గౌడ్, పుట్టి విజయలక్ష్మి, పాతూరి ప్రభావతి, ఉమామహేశ్వర్, నర్సారెడ్డి, కన్నపురం కృష్ణాగౌడ్, నవాత్ కిరణ్, తోట లక్ష్మిపతి, కొవ్వూరి లక్ష్మణ్, సంతోష్, ఏలూరి రవీందర్, చింతల రాములు, వెంకటేశం తదితరులు ఉన్నారు.