Telangana Rythu Vignana kendram | మెదక్ రూరల్, డిసెంబర్ 20 : మెదక్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం ఆవరణలో ఉన్న తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర భవనాన్ని మధ్య తెలంగాణ మండల సహ పరిశోధన సంచాలకులు డా . ఆర్ ఉమారెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా ఉమారెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మన వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతుల తరుపున విస్తరణ విభాగానికి సంబంధించి కార్యాలయం లేదు.. అందువల్ల విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య సూచనల మేరకు మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో భాగంగా మన మెదక్ జిల్లాకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (పూర్వం ఏరువాక కేంద్రం) కేటాయించబడినది అని తెలియజేశారు.
ఈ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వల్ల రైతులకు సలహాలు సూచనలు, విస్తరణ సేవలు, శిక్షణా కార్యక్రమాలు అందించుటకు ఉపయోగపడుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ , జిల్లా వ్యవసాయ అధికారి కే దేవ్ కుమార్, సహాయ వ్యవసాయ సంచాలకులు విన్సెంట్ వినయ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏ.ఓ టెక్నికల్ హర్షిత, వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

శిథిల పంచాయతీలు.. నూతన జీపీల్లో భవనాల నిర్మాణానికి కేసీఆర్ నాడు శ్రీకారం
Insurance Claim | తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు.. పాముకాటుతో చంపించారు..
Pilot Attack: ప్రయాణికుడిని కొట్టిన పైలట్.. సస్పెండ్ చేసిన ఎయిర్ ఇండియా