తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని జనగామ ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఢిల్లీలో తెలంగాణ అంటే అదెక్కడుంటుంది అనే వాళ్లని.. కేసీఆర్ రాష్ట్రం సాధించిన తర్వాత పరిపాలన దక్షతతో దేశానికే ఐకాన్‌గా తెలంగాణను మార్చారని పేర్కొన్నారు.
ఒకనాడు బువ్వకు నోచుకోని.. జ్వరం వస్తేనో.. జేజమ్మకు పెడితేనో తెల్లటి మెతుకులు దొరికేవి కానీ ఇప్పుడు భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. జనగామ జిల్లా ఇచ్చి జిల్లా ఆకృతి తెచ్చి, మెడికల్ కాలేజీ మంజూరు చేసి నిండుగా నీళ్లు ఇచ్చిన ఫలితంగానే ఈ ప్రాంతం సస్యశ్యామలమైందని పేర్కొన్నారు. నాటి జనగామ ఎట్లుండె.. నేడు ఎలా మారిందో మీ కండ్ల ముందున్నదని అని చెప్పారు. రాష్ర్టాధినేత, కాబోయే దేశాధినేతను ఆశీర్వదించేందుకు అశేషంగా తరలివచ్చిన ప్రజలకు ముత్తిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జై తెలంగాణ.. కేసీఆర్ నాయకత్వం.. కేటీఆర్ నాయకత్వం.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఎమ్మెల్యే నినాదాలు చేశారు.