జహీరాబాద్, డిసెంబర్ 23: సరిహద్దులో నేరాలు నివారించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన పోలీసులు వన్ ఇండియా,వన్ పోలీసు అనే విధంగా పని చేయాలని బీదర్ జిల్లా ఎస్పీ కిశోర్ బాబు తెలిపారు.శుక్రవారం కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకా కేంద్రంలో మూడు రాష్ర్టాలకు చెందిన పోలీసు అధికారులు సరిహద్దు నేరాల పై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో నేరాలు నివారించేందుకు మూడు రాష్ర్టాలకు చెందిన పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు. అంతరాష్ట్ర నేరాస్తుల సమాచారం, పరస్పర సహకారం చేసుకొని నేరాలు నివారించేందుకు కృషి చేయాలన్నారు.
సరిహద్దులు అనేది పాలనా సౌలభ్యం కోరకు ఏర్పాటు చేశారని, పోలీసులకు వన్ ఇండియా వన్ పోలీసు లాగా కలసి పని చేయాలన్నారు. నేరస్తులు ఏ ప్రాంతానికి చెందిన వారైనా సమాచారం అందించుకోవాలన్నారు. నేరస్తులకు ఈ ప్రాంతం అనేది ఉండదని, వారు ఎక్కడైనా నేరాలు చేసే అవకాశం ఉందన్నారు. నేరాలు మా ప్రాంతంలో చేయడం లేదని, ఎప్పుడూ భావించారదని, ఎక్కడ నేరం చేసినా సమాచారం తెలుసుకొని నేరాస్తులను అదుపులోకి తీసుకోవాలన్నారు.
మూడు రాష్ర్టాలకు చెందిన పోలీసులు సమన్వయంతో పని చేస్తే ఎక్కువ సంఖ్యలో నేరస్తులను అదుపులోకి తీసుకోనే అవకాశం ఉందన్నారు. సమావేశంలో హుమ్నాబాద్ అడిషనల్ ఎస్పీ శివనుషు రాజపుట్, జహీరాబాద్ డీఎస్పీ రఘు, జహీరాబాద్ సీఐ తోట భూపతి, చిరాగ్పల్లి ఎస్సై కాశీనాథ్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు.