మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఆలోచించి ఓటేయాలని, ఆడబిడ్డగా తనను మరోసారిఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం రామాయంపేట మండలం లక్ష్మాపూర్, బాపనయ్య మోత్కులతండా, కాట్రియాల, కాట్రియాల తండా, దంతెపల్లి, కిషన్‌తండా, తీన్ నెంబర్ తండాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైనంపల్లికి ఓటేస్తే చిక్కడు, దొరకడన్నారు. ఆడబిడ్డగా ఆదరించి నన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడడంతో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లోపాలుపంచుకుంటానని హామీ ఇచ్చారు.
రామాయంపేట రూరల్, నవంబర్6: ఆడబిడ్డగా మరోసారి ఆదరిస్తే మరింత అభివృద్ధి చేసుకుందామని మెదక్ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం రామాయంపేట మండలం లక్ష్మాపూర్, బాపనయ్య మోత్కుల తండా, కాట్రియాల, కాట్రియాల తండా, దంతేపల్లి, కిషన్‌తండా, తీన్ నెంబర్ తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం రామాయంపేట మండలం లక్ష్మాపూర్, బాపనయ్య మోత్కుల తండా, కాట్రియాల, కాట్రియాల తండా,దంతేపల్లి, కిషన్ తండా, తీన్నెంబర్ తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు బోనాలు, డప్పుచప్పుల్లతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆలోచించి.. అభివృద్ధికి ఓటేయాలన్నారు. మైనంపల్లికి ఓటేస్తే చిక్కడు, దొరకడన్నారు. ఆడబిడ్డగా ఆదరించి తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధితోపాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హన్మంతరావు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉన్నాడో ప్రజలు ఆలోచించాలని కోరారు. 13 ఏండ్లపాటు నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండా పత్తాలేకుండా పోయిన మైనంపల్లి తన కొడుకును ఎమ్మెల్యేగా చేసేందుకు ఎత్తుకొని వచ్చాడని ఆరోపించారు.
నియోజకవర్గంపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కుర్చీల కోట్లాట ఉంటుందని, ఆ పార్టీ చెప్పే మాయమాటలు విని మోసపోవద్దన్నారు. 11 సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కష్టాలు తప్పవని, కర్ణాటక పరిస్థితి మనకు రావద్దన్నారు. దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతులకు పంట సాగుకు 24 గంటల కరెంటు సరాఫరా చేస్తున్నారని, రైతుబీమా, రైతుబంధు ఇస్తున్నారని తెలిపారు. రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 2001లో ఉమ్మడి రామాయంపేట మండలంలో జడ్పీటీసీ సభ్యురాలుగా తనకు రాజకీయ జీవితాన్ని అందించిందన్నారు. కార్యక్రమంలో ఆ యా గ్రామాల సర్పంచ్‌లు మైలారం శ్యాములు, బోయిన దయాలక్ష్మి, సుభాష్ రాథోడ్, సురేశ్ నా యక్, ఆర్కే మల్లేశం, సడాల శివప్రసాదరావు, ఎం పీటీసీ బుజ్జి, ఎంపీపీ భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండారి మహేందర్‌రెడ్డి, కాట్రియాల ఉప సర్పంచ్ కొత్త స్రవంతి, సిద్దిరాంరెడ్డి, ఇతర నాయకులు మైసాగౌడ్, శ్యాంరెడ్డి, రాజయ్య, దేవేందర్, కొత్త రాజేందర్, మానెగల్ల రామకిష్టయ్య, విజయభాస్కర్‌రెడ్డి, పిట్ల భూలింగం, సిద్దిరాములు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.